హైదరాబాద్: క్రెడాయ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ హెచ్ఐసీసీలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఏపీని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ పరోక్షంగా సెటైర్లు వేశారు. ‘పక్క రాష్ట్రాల్లో పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. పక్క రాష్ట్రాల్లో రోడ్లు, విద్యుత్, నీళ్లు లేవు. ఆయా రాష్ట్రాల్లో మన వాళ్లు పర్యటిస్తే వాస్తవాలు తెలుస్తాయి. నేను చెప్పేది అతిశయోక్తి కాదు. పక్క రాష్ట్రం వెళ్లి వచ్చిన ఉత్తరాది ఎంపీనే నాకు చెప్పారు. తెలంగాణలో ఒక్క రూపాయి లంచం లేకుండానే పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నాం. పక్క రాష్ట్రాల్లో అధికార పార్టీ, ప్రతిపక్షాలకు లాంచాలిస్తేనే అనుమతులు ఇస్తారు’ అని అన్నారు.