ఆదిలాబాద్ జిల్లా: జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి కి ఓ ఎస్సై ప్రథమ చికిత్స అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. గుడిహత్నూర్ మండలం తోషం వద్ద బుధవారం ఆర్టీసీ బస్సు ఎదురుగా ద్విచక్ర వాహనంపై వస్తున్న ఎస్. కే ఫారూఖ్ ను ఢీకొంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఆయన కు తీవ్ర గాయాలై స్పృహ కోల్పోయాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఇంద్రవెల్లి ఎస్ఐ సునీల్ గాయపడ్డ వ్యక్తి కి ఉపిరి అందకపోవడంతో నోట్లో గాలి ఉదుతూ శ్వాస ను అందించిన ప్రథమ చికిత్సను అందించారు. అనంతరం ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అటు రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి పట్ల మానవత్వం చాటుకున్న ఎస్సై తీరుపై స్థానికులు హర్షం. వ్యక్తం చేశారు.