Telugu Updates

మున్సిపల్ కమిషనర్ అత్యుత్సాహం.. సస్పెండ్ చేయాలని కేటీఆర్ ఆదేశాలు

హైదరాబాద్: బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ ను సస్పెండ్ చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 24న మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలకు హాజరు కాలేదని నలుగురు సిబ్బందికి బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ మెమో జారీ చేశారు. 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని వారిని ఆదేశించారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్.. సదరు అధికారి అత్యుత్సాహం పై తీవ్రంగా మండిపడ్డారు.

ఈ మేరకు ట్విటర్ ద్వారా స్పందించిన కేటీఆర్.. కమిషనర్ ను సస్పెండ్ చేయాలని పురపాలక శాఖ డైరెక్టర్ సత్యనారాయణను ఆదేశించారు. రాజకీయాలు, పరిపాలనలో సైకోఫ్యాన్సీని ప్రోత్సహించడంలో తాను చివరి వ్యక్తినని కేటీఆర్ స్పష్టం చేశారు.