Telugu Updates

ఓయూలో విద్యార్థుల మహా ర్యాలీ.. ఉద్రిక్తత

తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓ.యూ.కు రావాలి

హైదరాబాద్: నగరంలోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘాలు మహా ర్యాలీ చేపట్టాయి. ఓయూలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ర్యాలీకి అనుమతి లేదంటూ.. విద్యార్థులను అరెస్టు చేసి పీఎస్ కు తరలించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వరంగల్ లో రైతు సంఘర్షణ సభ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ నెల 6న తెలంగాణకు రానున్నారు. ఏడో తేదీ ఓయూలో పర్యటనకు టీపీసీసీ ప్రయత్నం చేయగా.. వర్సిటీ అనుమతివ్వని విషయం తెలిసిందే.