Telugu Updates

ఇంకా 4 రోజులే.. మిస్‌ చేస్తే మీకే కష్టం..!

తెలంగాణ: త్వరపడండి… మరో 4 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మీ వెహికల్‌పై పెండింగ్‌ చలాన్ డిస్కౌంట్‌తో చెల్లించారా ?? ఎందుకంటే ట్రాఫిక్ పోలీసులు ఇచ్చిన గడువు ముగిశాక ఒకవేళ పెండింగ్ చలాన్‌ ఉన్నాయే అనుకోండి ఇక చర్యల విషయంలో తగ్గేదేలే అంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. తెలంగాణ ప్రజలపై పెండింగ్ చలాన్‌ వాహనదారులపై ఆర్థిక భారం తగ్గించడానికి భారీ డిస్కౌంట్ల ను ప్రకటించింది తెలంగాణ పోలీస్ శాఖ. మీరు ఊళ్లో లేకపోయినా సరే..ఆన్‌లైన్ లో అయినా పెండింగ్ చలానాలు చెల్లించమంటున్నారు పోలీస్ అధికారులు రాయితీ వర్తింపు గడువులోగా చలాన్లు క్లియర్ చేసుకోలేకపోతే తర్వాత భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పెండింగ్ ఛాలాన్ అమలులోకి రాగానే వాహనదారులో భారీ స్పందన వచ్చింది. మూడు పోలీస్ కమిషనరెట్ పరిధిలో అనూహ్య స్పందన వచ్చింది. దాదాపు 650 కోట్లకు పైగా విలువైన చలాన్స్ క్లియర్ అయ్యాయి. ఇందులో రాయితీ పొగ 190 కోట్లు ప్రభుత్వ ఖజానా కు వచ్చి చేరాయి. ఇప్పటి వరకు కోటి ఎనభై ఐదు లక్షల చలాన్లు క్లియర్ అయ్యాయని నగర్ ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఇదిలా ఉండగా రోజుకు ఏడు నుండి పది లక్షల వరకు చలాన్లు క్లియర్ అవుతున్నాయని, మార్చి 31 వరకే ఈ అవకాశం ఉంటుంది. సద్వినియోగం చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

ఇప్పటికి అయితే గడువు పొడిగింపు ఆలోచన లేదన్నారు నగర జాయింట్ ట్రాఫిక్ సీపీ. ఇప్పటి వరకు 15 వందల కోట్ల విలువ చేసే చలాన్ల పెండింగ్ ఉన్నాయి. 60 నుండి 70 శాతం క్లియర్ అవుతాయని ఆశిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. గడువు సమయం తర్వాత ట్రాఫిక్ రూల్స్ వయిలెట్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయనీ పోలీస్ అధికారులు హెచ్చరించారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో హైయెస్ట్ చలాన్లు క్లియర్ అయ్యాయన్నారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వారిపై ఛార్జ్ షీట్ లు వేస్తాం అన్నారు. ఏప్రిల్ నుండి ట్రాఫిక్ రూల్స్ ఉలంఘిస్తే చార్జ్ షీట్ లు వేస్తాం అనీ తెలిపారు. కోవిడ్ కారణాలతో గ్యాప్ ఇచ్చాం.. తిరిగి మునుపటి లాగే కేసులు నమోదు చేసి జైళ్లకు పంపుతాం అన్నారు.