మంచిర్యాల జిల్లా: మంచిర్యాల మున్సిపాలిటీ 3వ వార్డు పరిధిలోని సూర్య నగర్ లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. కాలనీలోని రోడ్ నంబర్ 23లో రోడ్లపై పూర్తిగా నీరు నిలిచిపోయి ప్రజలు ఇళ్ళల్లో నుండి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. రోడ్డు నిర్మించాలని 6 నెలల క్రితం మున్సిపల్ ద్వారా ప్రణాళిక రూపోందించినా ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదు. దీంతో వర్షం పడిందంటే కనీసం నడిచి వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్, మున్సిపల్ డిప్యూటీ ప్లోర్ లీడర్ మజీద్ మాట్లాడుతూ వార్డులో నెలకొన్న సమస్యలపై ప్రతి కౌన్సిల్ సమావేశంలో నిలదీసిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. సమస్యల పరిష్కారానికి ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ ముందుండి పోరాటం చేస్తుందని ఆయన పేర్కొన్నారు..