బెంగళూరు: అదనపు కొవ్వును తీయించుకొని మరింత అందంగా కనిపించాలని భావించిన ఓ యువ నటి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. శస్త్రచికిత్స వికటించి 21 ఏళ్ల కన్నడ నటి చేతన రాజ్ మృతిచెందారు. కొవ్వును బెంళగూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. శస్త్రచికిత్స అనంతరం అనారోగ్య సమస్యలు తలెత్తి నటి మృతిచెందినట్లు ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్లాస్టిక్ సర్జరీ అనంతరం చేతన ఊపిరితిత్తుల్లో ద్రవం నిండిపోయి గుండెపోటుతో మరణించారు. అయితే వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని ఆమె తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. దీనిపై ఆసుపత్రి డాక్టర్లు స్పందిస్తూ.. నటి ఆరోగ్యం క్షీణించడంతో 45 నిమిషాలపాటు సీపీఆర్ పద్ధతిలో వైద్యం అందించామని, అయినా ఫలితం లేకపోవడంతో సమీపంలోని మరో ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. కానీ అప్పటికే ఆమె మృతిచెందినట్లు పేర్కొన్నారు.
నటి తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా ఇరువురు వైద్యులపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పలు యాడ్లు, సీరియళ్లతో చేతన్ రాజ్ గుర్తింపు తెచ్చుకున్నారు.