Telugu Updates

ప్రధాని మోడీని హత్య చేస్తామని ఎన్ఐఏకు మెయిల్..!

ఆంజనేయులు న్యూస్: దుండగులు చేసిన ఓ మెయిల్ తో ఎన్ఐఏ అధికారులు అప్రమత్తమయ్యారు. ఏకంగా ప్రధాని మోడీని మట్టుబెడతామని, అందుకు ప్లాన్ సిద్ధం చేసినట్లు చెప్పడంతో అవాక్కయ్యారు. శుక్రవారం ఈ ఘటన జరిగింది. ఎన్ఐఏ అధికారులకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి మెయిల్ వచ్చింది. అందులో ప్రధాని మోడీ హత్య చేస్తున్నామని, అందుకు 20 కిలోల ఆర్డీఎక్స్ సిద్ధం చేశామని ఉంది. అంతేకాకుండా 20 స్లీపర్ సెల్స్ ఆత్మాహుతి దాడికి సిద్ధంగా ఉన్నారని అందులో పేర్కొన్నారు. దీంతో దుండగుల వార్నింగ్ పై ముంబైలోని ఎన్ఐఏ అధికారులు ఆరా తీస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ముంబైలోని ఎన్ఐఏ అధికారులు విచారణ ప్రారంభించారు. ఎవరైనా ఆకతాయి పనిగా చేశారా లేక బెదిరింపు ఉగ్ర సంస్థల నుంచి వచ్చిందా అనే కోణాల్లో విచారణ ముమ్మరం చేశారు..