రామగుండం పోలీస్ కమిషనరేట్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో సైబర్ నేరాలను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. సైబర్ మోసానికి గురైన వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్లు 1930, డయల్ 100, 112 లకు బాధితులు ఫిర్యాదు చేయాలని సూచించారు. లేదా NCRP portal (www. cybercrime. gov.in) లో ఫిర్యాదు చేస్తే సంబంధిత పోలీస్ స్టేషన్ వారు తక్షణమే స్పందిస్తారని పేర్కొన్నారు. బాధితులు ఏలాంటి భయాందోళన లేకుండా నేరుగా పిర్యాదు చేస్తే సత్వరమే న్యాయం చేస్తామని తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తుల పోన్ కాల్స్, మెస్సేజ్ లింక్స్ ఓపెన్ చేసి ఇబ్బందులకు గురికావద్దని సిపి సూచించారు..