Telugu Updates

ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి

మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని టిఆర్ఎస్వీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్వీ పట్టణ ఉపాధ్యక్షులు చిప్పకుర్తి జగన్ మాట్లాడుతూ పట్టణంలోని బ్రిలియంట్ పాఠశాలలో చదువుతున్న ఆరవ తరగతి విద్యార్థిని ఆర్థిక సమస్యలతో ప్రభుత్వ పాఠశాలలో చేరడానికి అవసరమైన టిసి, బోనఫైడ్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా పెండింగ్ లో ఉన్న ఫీజు చెల్లించాలని ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. విద్య వ్యాపారమయం కాకుండా కాపాడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్వి నాయకులు నక్క తిరుపతి సంజయ్, ప్రవీణ్, రఘు అంజి, తదితరులు పాల్గొన్నారు.