Telugu Updates

పుష్ప-2′ స్క్రిప్ట్ లో మార్పులపై నిర్మాత క్లారిటీ.!

ఆంజనేయులు న్యూస్: ‘కేజీఎఫ్-2’ సినిమా బిగ్గెస్ట్ హిట్ కావడంతో ఇప్పుడు ఆ సినిమా ప్రభావం ‘పుష్ప-2’ పై పడొచ్చని వార్తలు వచ్చాయి. దీంతో పుష్ప సినిమా పార్ట్-2 స్క్రిప్ట్ డైరెక్టర్ సుకుమార్ మార్పులు చేస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈ విషయంపై సినిమా నిర్మాత వై రవిశంకర్ స్పందించారు. స్క్రిప్ట్ ఎలాంటి మార్పులు చేయడం లేదని స్పష్టం చేశారు. ‘కేజీఎఫ్-2’ ప్రభావం ‘పుష్ప-2’ పై ప్రభావం చూపించదని అన్నారు. ఇప్పటికే తమ దగ్గర పార్ట్-2 కోసం హైఓల్టేజ్ స్క్రిప్ట్ రెడీగా ఉందని చెప్పారు. లొకేషన్ల కోసం కొన్ని రోజులుగా తిరుగుతున్నామని అన్నారు.

పుష్ప పార్ట్ -1 షూటింగ్ జరిగిన అడవిలోనే పార్ట్-2 ని కూడా తెరకెక్కిస్తామని రవిశంకర్ చెప్పారు. పార్ట్-1 లో పుష్పరాజ్ అనే సాధారణ కూలీ ఎర్రచందనం స్మగ్లింగ్ మాఫియాను శాసించే స్థాయికి ఎలా ఎదగాడన్నది చూపించారు. అయితే పార్ట్-2 లో ఏమేం చూపించబోతున్నారన్న దానిపై అభిమానుల్లో ఆసక్తి విపరీతంగా పెరిగింది..