44వ చెస్ ఒలింపియాడ్ పోటీలు ప్రారంభం
ఆంజనేయులు న్యూస్: ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా 44వ చెస్ ఒలింపియాడ్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రపంచమంతా చుట్టేసిన ఒలింపియాడ్ టార్ఛ్ ను ప్రధాని మోదీ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కు ఐదుసార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ అందజేశాడు. మొట్టమొదటిసారి చెస్ ఒలింపియాడ్ కు భారత్ ఆతిథ్యం ఇస్తుండటం విశేషం. ఆగస్టు 10వ తేదీ వరకు పోటీలు జరుగుతాయి. చెస్ ఒలింపియాడ్ లో ఆనంద్ పాల్గొనకుండా.. ఆటగాళ్లకు మెంటార్గా వ్యవహరించనున్నాడు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. “చదరంగం మాతృభూమిపై ప్రతిష్ఠాత్మక ఈవెంట్ జరగడం ఆనందంగా ఉంది. సొంత ప్రాంతంలో తొలిసారి చెస్ ఒలింపియాడ్ జరుగుతోంది. గత మూడు దశాబ్దాల కాలంలో ఆసియాకు రావడం ఇదే మొదటిసారి. క్రీడలు ఎప్పుడూ అద్భుతమైనవే. తమిళనాడులోని ఆలయాలను పరిశీలిస్తే… దేవుడు కూడా చెస్ ఆడిన ఆనవాళ్లు కనిపిస్తాయి. అందుకే ఈ రాష్ట్రానికి చెస్తో ఎంతో చరిత్రాత్మక అనుబంధం ఉంది. భారతే తమిళనాడు చెస్ పవర్హిహౌస్ అయింది. తమిళనాడు ఎంతో మంది గ్రాండ్మాస్టర్లను తయారు చేసింది” అని ప్రధాని మోదీ వివరించారు..
కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, సూపర్ స్టార్ రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యానే తొలుత ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే అక్కడి పరిస్థితుల నేపథ్యంలో టోర్నమెంట్ భారత్కు తరలివచ్చి విషయం తెలిసిందే.