హనుమకొండ జిల్లా: కమలాపూర్ లో దారుణం చోటుచేసుకుంది. మండలంలోని ఓ గ్రామంలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికపై లైంగిక దాడి చేసినట్లు సమాచారం. పాఠశాల ఆవరణలోనే ఈ ఘోరం జరిగినట్లు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా నలుగురు యువకులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..