Telugu Updates

అల్లు అర్జున్, కల్యాణ్ రామ్ కార్లకు నల్లతెరల తొలగింపు..

హైదరాబాద్: సినీనటులు అల్లు అర్జున్, కల్యాణ్ రామ్ కార్లకు నల్లతెరలను జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు తొలగించి చలానాలు విధించారు. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఎస్సై శ్రీధర్ శనివారం రోడ్ నంబరు 36లోని నీరూస్ కూడలిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అల్లు అర్జున్, కల్యాణ్ రామ్ తమ కార్లలో అటుగా వెళ్తుండగా ఆపారు. కార్ల అద్దాలకు ఉన్న నలుపు తెరలను తొలగించి రూ. 700 చొప్పున చలాన్లు విధించారు. నలుపు తెరతోపాటు ఇతర నిబంధనలు పాటించని 80కిపైగా వాహనాలపై కేసులు నమోదు చేశారు..