Telugu Updates

IIIజీవో ఎత్తివేత ఉత్తర్వులు చెల్లవు: రేవంత్

హైదరాబాద్: తెలంగాణలో 111జీవో పరిధిలోని 84 గ్రామాల్లో ఆంక్షలు ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన కొత్త జీవో చెల్లదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ కాపీని ట్వీట్కు ట్యాగ్ చేశారు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు 111జీవోపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ 2007 జులై 16న హైకోర్టు స్టే విధించిందన్నారు. పరివాహక ప్రాంతాన్ని పది కిలోమీటర్ల నుంచి 500 మీటర్లకు తగ్గించాలని కోరడంపై హైకోర్టు ఈ స్టే విధించినట్లు చెప్పారు. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఇచ్చిన జీవో 69 చెల్లదన్నారు. మంత్రి కేటీఆర్ రియల్ ఎస్టేట్ మాఫియా కోసమే 111జీవో రద్దు చేసి ఆంక్షలు ఎత్తేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు..