Telugu Updates

కొమరం భీం, జిల్లాలో ఆర్ఆర్ఆర్ మూవీ డైరెక్టర్.?

కుమరంభీం, జిల్లా: జిల్లా పర్యటనలో వచ్చిన ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళిని గుస్సాడీ టోపీని బహుకరించిన పద్మా శ్రీ అవార్డు గ్రహీత కనక రాజు గుస్సాడీ. అనంతరం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అడిషనల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి తో కలసి కొత్త గా నిర్మించిన గాలి బుడగలు థియేటర్ ని సందర్శించి ఆర్ఆర్ఆర్ చిత్రాని వీక్షించారు. అనంతరం రాజమౌళి మాట్లాడుతూ.. కొమరంభీమ్ పోరు గడ్డ జిల్లాను సందర్శించడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. బాహుబలి చిత్రం ద్వారా గుస్సడి నృత్యం ప్రపంచంనికి చాటి చెప్పిన దర్శకుడు. తన చిత్రాల ద్వారా ఆదివాసి గుస్సాడి సంస్కృతి నృత్యాన్ని బాహ్య ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి రాజమౌలి. జల్, జంగల్, జమీన్ పోరాట యోధుడు కొమరంభీమ్ స్ఫూర్తిని ఆర్ఆర్ఆర్ మూవీతో గోండ్ జాతి తెగువను ప్రపంచ ఏళ్లలో దాటించిన గొప్ప దర్శకుడు. రాజమౌళి తో పద్మశ్రీ అవార్డు గ్రహీత కనక రాజు గుస్సాడి కొమరంభీమ్ జిల్లా యందు జడ్పీ కార్యాలయం లో మర్యాద పూర్వకంగా కలిసి ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాల గురించి ముచ్చటించడం జరిగింది. ఆదివాసుల జీవితాలపై మరొక గొప్ప చిత్రం చెయ్యాలని పద్మశ్రీ కనక రాజు గుస్సాడి అన్నారు.

ఈ కార్యక్రమంలో పద్మ శ్రీ కనక రాజు గుస్సాడి బృందం సభ్యులు కనక వెంకటేశ్వర్ కనక సుదర్శన్, జూగ్నక సోనేరావ్, మరియు కనక ఛత్రుఘన్ తదితరులు పాల్గొన్నారు..