Telugu Updates

క్లాసు రూంలుగా ఆర్టీసి బస్సులు..?

కేరళ: కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులను తుక్కుకు వేస్తుంటారు. కానీ కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఆ బస్సుల పై కీలక నిర్ణయం తీసుకుంది. కాలం చెల్లిన బస్సులను తరగతి గదులుగా ఆధునీకరించి అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించినట్టు కేరళ రవాణాశాఖ మంత్రి ఆంటోని రాజు తెలిపారు. ముందుగా లో బస్సులను క్లాసు రూంలుగా మార్చుతామన్నారు. దీని ద్వారా పిల్లలకు కూడా కొత్త అనుభూతి కలుగుతుందన్నారు. ముందుగా తిరువనంతపురం నగరంలోని ప్రభుత్వ స్కూల్లో అమల్లోకి తీసుకొస్తామని, ఆ తర్వాత రాష్ట్రమంతా అమలు చేస్తామని మంత్రి అన్నారు. మొత్తం 400 బస్సులను ఇలా ఆధునీకరిస్తామన్నారు. ఒక్కో బస్సులో 50 మంది విద్యార్ధులు కూర్చునేలా తరగతి గదిలాగా తీర్చిదిద్దనున్నారు..