Telugu Updates

సమతామూర్తి స్ఫూర్తి కేంద్రానికి ఆర్టీసీ బస్ సర్వీసులు

హైదరాబాద్: శంషాబాద్ మండలం, ముచ్చింతల్ శ్రీరామనగరంలోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం ప్రారంభించిన ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ డీఎం రాములు శనివారం ప్రకటనలో కోరారు. అబ్జల్గంజ్ -ఆరాంఘర్ మీదుగా స్ఫూర్తి కేంద్రం వరకు రోజు ఉదయం 7.20 గంటలకు ఆర్టీసీ సర్వీసులు ప్రారంభమవుతాయన్నారు. ముచ్చింతల్ నుంచి రాత్రి 8.05 గంటలకు చివరి బస్సు అబ్జల్గంజ్ కు ఉంటుందన్నారు..