మంచిర్యాల జిల్లా: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పెండింగ్ కేసులు త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి సూచించారు. సోమవారం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ బాధితులకు సత్వర న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటుందన్నారు. చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా సద్వినియోగ పర్చుకోవాలని, బాధితులకు న్యాయం అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. జిల్లాలో నమోదైన కేసులు పరిష్కరించడంతో పాటు పరిహారం సకాలంలో అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.. నమోదైన కేసులపై పూర్తి స్థాయి విచారణ జరపాలని, తప్పుడు కేసులు నమోదు చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. జిల్లా అధికార యంత్రాంగం మండల, గ్రామ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలకు పూర్తి స్థాయి అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, ఇంచార్జ్ డిసిపి అఖిల్ మహాజన్, మంచిర్యాల, జైపూర్, బెల్లంపల్లి ఎసిపిలు తిరుపతిరెడ్డి, నరేందర్, ఎడ్ల మహేష్, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి రవీందర్ రెడ్డి, మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీఓలు వేణు, శ్యామలాదేవి, కమిటీ సభ్యులు జిల్లపెల్లి వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు..