Telugu Updates

స్కూల్ లో బాలికల దుస్తులు విప్పించి దారుణం..?

ఢిల్లీ: లో దారుణ ఘటన జరిగింది. స్థానికంగా ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాలలో ఓ వ్యక్తి ప్రవేశించాడు. క్లాస్ రూమ్ డోర్ వేసి విద్యార్థుల ఎదుట వికృతంగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపుతోంది. ఏప్రిల్ 30వ తేదిన ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడు స్కూల్ లోకి ప్రవేశించి ఓ గదిలోకి వెళ్లాడు. ఒక తరగతి గది డోర్ ను లాక్ చేశాడు. ఇద్దరు విద్యార్థినుల దుస్తులు తొలగించడమే కాకుండా వారిముందే మూత్ర విసర్జన కూడా చేశాడు..

ఇలా పైశాచికంగా ప్రవర్తించడంతో అక్కడున్న విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. దీనిపై విద్యార్థులు యజమాన్యానికి ఫిర్యాదు చేసిని పట్టించుకోకపోవడంతో ఢిల్లీ మహిళా కమిషన్ దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనపై సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలని స్వాతి మలివాల్ పోలీసులను ఆదేశించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు..