Telugu Updates

శుక్లాల సర్జరీలు చేయించుకోవట్లే!

50% రోగులు సర్జరీ ఆలస్యం చేస్తున్నారు.. సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ: దేశంలో మెట్రో నగరాల్లో కంటి శుక్లాల సమస్యలతో బాధపడేవారిలో 50శాతంమందికి పైగా రోగులు సర్జరీని ఆలస్యం చేస్తున్నారని ప్రిస్టిన్‌ కేర్‌ సంస్థ చేపట్టిన ఓ సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా మెట్రో నగరాల్లోని 1000మందికిపైగా కంటి శుక్లాల బాధితులపై ఈ నెల 18 నుంచి 25 మధ్యలో ప్రిస్టిన్‌ కేర్‌ ఈ సర్వేను నిర్వహించింది. తమ అధ్యయన వివరాలను సోమవారం ఒక నివేదికలో వెల్లడించింది. దాని ప్రకారం.. సర్జరీని ఆలస్యం చేస్తున్న వారిలో అధికశాతం మంది అపోహలతోనే ఉంటున్నట్లు తేలింది. కంటిచూపు పూర్తిగా పోతుందన్న భయంతోనో, నొప్పి కలుగుతుందనో లేక కోలుకోవడానికి సుదీర్ఘ కాలం పడుతుందనో రోగులు సర్జరీని వాయిదా వేస్తున్నారని సంస్థ తెలిపింది..