Telugu Updates

ఇలాంటివి భారత్ లోనే సాధ్యమంటోన్న ఆనంద్ మహీంద్రా

ఆంజనేయులు న్యూస్: సామాజిక మాధ్యమాల్లో నిత్యం చురుగ్గా ఉంటూ ఎన్నో కొత్త విషయాలను పంచుకుంటుంటారు ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా. సరికొత్తగా అనిపించే ఫొటోలు, వీడియోలను ట్విటర్ లో పోస్టు చేస్తూ ఉంటారు. తాజాగా ఆయన పంచుకున్న ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. చిన్నచిన్న లైట్లు, ఇతర అలంకరణ వస్తువులతో అందంగా ముస్తాబు చేసిన స్కూటర్ కు సంబంధించిన క్లిప్పింగ్ ను మహీంద్రా తన ట్విటర్ ఖాతాలో పంచుకున్నారు. టైర్లు మినహాయిస్తే.. ఆ స్కూటర్ మొత్తాన్ని అలంకరణ వస్తువులతో చూడముచ్చటగా తయారు చేశారు. హ్యాండిళ్ల మధ్య డూంలో ఓ సెల్ ఫోన్ ను సైతం అమర్చారు. ఓ పెట్రోల్ బంకు వద్ద పార్కు చేసి ఉన్న ఈ స్కూటర్ వద్ద పలువురు సెల్ఫీలు కూడా తీసుకోవడం ఆ వీడియోలో కనిపిస్తుంది. కాగా ఆ వీడియోను మహీంద్రా షేర్ చేస్తూ.. ‘జీవితం రంగులమయంగా, వినోదాత్మకంగా ఉండాలని మీరు కోరుకుంటే అలాగే ఉంటుంది’ అని పేర్కొన్నారు. ఇలాంటి వినూత్న ఐడియాలు భారత్ లొనే సాధ్యం అని అన్నారు. కాగా ఆ పోస్టును ఇప్పటికే 3. 3లక్షల మంది వీక్షించారు. 16వేల మంది లైక్ చేశారు..