మన సమాజం,నిర్మల్ జిల్లా: దస్తురాబాద్ మండలంలోని గొడిసేర్యాల్ శివాలయంలో మహాద్భుతం చోటుచేసుకుంది,మహాశివరాత్రి పర్వదినాన ఆలయ గర్భగుడిలో నాగుపాము దర్శనమిచ్చింది,నాగేంద్రున్ని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్ల ద్వారా బార్లు తీరారు. మహాశివరాత్రి పర్వదినం రోజు రాత్రి 11 గంటల సమయంలో నాగుపాము ప్రత్యేక్షమైంది నాగేంద్రున్ని దర్శించుకునేందుకు భక్తులు భారీగా పోటెత్తారు,ఏట ఈ ఆలయంలో శివరాత్రి రోజు నాగుపాము దర్శనం ఇవ్వడం ఇక్కడి ప్రత్యేకం కావడంతో ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ జిల్లాల నుండి భక్తులు భారీ సంఖ్యలో ఈ ఆలయానికి తరలివచ్చి ఆలయంలో శివ భక్తులు జాగారాలు ఉంటూ నాగేంద్రున్ని దర్శించుకుంటారు.మహాశివరాత్రి పర్వదినం రోజున శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.