Telugu Updates

పోలీస్ కమిషనరేట్ లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

రామగుండం సీపీ ఎస్ చంద్రశేఖర్ రెడ్డీ

రామగుండం: రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో గురువారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పోలీస్ ఆర్ముడ్ హెడ్ క్వార్టర్స్ ఆవరణలో పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. తెలంగాణ ఉద్య మంలో ప్రాణత్యాగం చేసిన అమరులను ఎప్పుడూ స్మరిస్తూ ఉండాలని సూచించారు. శాంతిభద్రతలు కాపాడటంలో ఎంతో శ్రమించి ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎందరో వీర జవాన్లు సంఘ విద్రోహ శక్తులతో పోరాడి వారి ప్రాణాలను త్యాగం చేశారన్నారు..

తెలంగాణ పోలీసులు దేశంలోనే అత్యున్నత ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్న పోలీస్ వ్యవస్థగా పేరు పొందినట్లు సిపి వెల్లడించారు.