మంచిర్యాల జిల్లా: జిల్లాలో వేసవి సెలవుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మిట్టపల్లి తిరుపతి డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని చాణక్య డిగ్రీ కాలేజీలో నెల రోజులుగా 10వ తరగతి విద్యార్థుల వద్ద డబ్బులు వసూలు చేసి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు శేఖర్ పాల్గొన్నారు.