Telugu Updates

క్రీడలతో శారీరక ధారుఢ్యం, మానసిక ఉల్లాసం

మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హొళ్ళీ కెరీ

మంచిర్యాల జిల్లా: క్రీడలతో శారీరక ధారుఢ్యం, మానసిక ఉల్లాసం కలుగడంతో ఆరోగ్యంగా ఉంటారని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. స్వతంత్ర భారత వజోత్సవ మహోత్సవంలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలలో గురువారం నిర్వహించిన ఫ్రీడమ్ కప్ క్రీడా పోటీలకు డి.సి.పి. అఖిల్ మహాజన్, జిల్లా యువజన, క్రీడా శాఖ అధికారి బొబ్బిలి శ్రీకాంత్ రెడ్డీతో అజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… వజోత్సవ వేడుకలలో భాగంగా జిల్లాలో చేపట్టిన ఫ్రీడమ్ కప్ పోటీలలో మండల స్థాయిలో జరిగిన పోటీలలో గెలుపొందిన క్రీడాకారులు, క్రీడా జట్లకు జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. స్వాతంత్య్ర సాధనలో మహనీయులు, పోరాట యోధులు చేసిన పోరాటాలు, ఉద్యమాలతో నేడు మనం స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు అనుభవిస్తున్నామని, ఆ మహానుభావులు చేసిన త్యాగాలను ఎప్పటికీ మరిచిపోకూడదని, వారు చూపిన ఆదర్శాలు, ఆశయాలను ప్రతి ఒక్కరు ఆచరిస్తూ దేశాభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేయాలని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్, డి.సి.పి. క్రికెట్ ఆడి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.