తల్లిదండ్రుల ఆస్థిలో కుమార్తెకు హక్కు
డిల్లీ: భారత సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. తల్లిదండ్రుల ఆస్థుల్లో కొడుకులతో సమానంగా కూతుర్లకు కూడా హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. వారసత్వ ఆస్థుల్లో ఆడపిల్లలకు సమాన హక్కు ఉంటుందని తేల్చింది. హిందూ వారసత్వ సవరణ చట్టం 2005 ప్రకారం తల్లిదండ్రుల ఆస్థిలో కుమార్తెలకు కూడా సమాన హక్కులుంటాయని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. తండ్రి మరణించినప్పటికి కుమార్తెలకు సోదరులతో సమానంగా ఆస్థి హక్కు ఉంటుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తులు ధర్మాసనం ఈ కీలక తీర్పునిచ్చింది. 9 సెప్టెంబర్ 2005 నుంచి హిందూ వారసత్వ సవరణ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం తల్లిదండ్రుల ఆస్థి పై కుమారునికి ఉన్న సర్వహక్కులు కూతురుకు కూడా ఉంటాయి.