తెలంగాణ అసెంబ్లీలో కోమటిరెడ్డి Vs తలసాని.. కాంగ్రెస్ పై కేటీఆర్ నిప్పులు!
హైదరాబాద్: ప్రాజెక్టుల రీడిజైన్ పేరిట రూ. లక్షల కోట్లు అప్పులు చేసి సీమాంధ్ర కాంట్రాక్టర్లకు దోచి పెట్టారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపణలపై తెలంగాణ అసెంబ్లీలో కాసేపు దుమారం చెలరేగింది. దీనిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందిస్తూ.. కోమటిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనికి ప్రతిగా రాజగోపాల్ రెడ్డి తలసానిపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడంతో సభలో మాటల యుద్ధానికి దారితీసింది. ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డి తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవడంతో వివాదం సద్దుమణిగింది. ఈ క్రమంలో జోక్యం చేసుకున్న మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పై నిప్పుల వర్షం కురిపించారు..