Telugu Updates

తెలంగాణ అమరవీరులకు ఘన నివాళి..!

మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక బైపాస్ రోడ్ లోని తెలంగాణ అమరవీరుల స్థూపానికి ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, కలెక్టర్ భారతీ హోలికెరీ, ఇన్చార్జ్ డిసిపి అఖిల్ మహాజన్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ అమరవీరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు..