Telugu Updates

టైమర్ సెట్ చేసిన బాంబులు.. డ్రోన్ తో జారవిడిచి..

జమ్మూ: వాయు మార్గంలో డ్రోన్ల ద్వారా దేశంలోకి అక్రమంగా పేలుడు పదార్థాలను సరఫరా చేసేందుకు పాకిస్థాన్ ముష్కరులు చేస్తోన్న ప్రయత్నాలను జమ్మూ పోలీసులు భగ్నం చేశారు. సరిహద్దుల్లో అలాంటి ఓ డ్రోన్ ను గుర్తించి కాల్పులు జరిపారు. డ్రోన్ నుంచి జారవిడిచిన మూడు మ్యాగ్నెటిక్ ఐఈడీ బాంబులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అబ్నూర్ సెక్టార్ లొనీ భారత్ – పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో నిన్న రాత్రి ఓ డ్రోన్ సంచరిస్తున్నట్లు భద్రతా సిబ్బంది గుర్తించి కాల్పులు జరిపారు. ఆ తర్వాత పోలీసు పార్టీ అక్కడ మోహరించి యాంటీ డ్రోన్ వ్యవస్థను రంగంలోకి దించారు. అనంతరం రాత్రి 11 గంటల ప్రాంతంలో కనక్ మరోసారి డ్రోన్ కన్పించింది. వెంటనే భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారు. ఈ క్రమంలోనే డ్రోన్ లో ఉన్న పేలోడ్ కిందపడగా.. డ్రోన్ మాత్రం తప్పించుకున్నట్లు జమ్మూ అదనపు డీజీపీ ముకేశ్ సింగ్ తెలిపారు.