Telugu Updates

అనాధ వృద్ధుడి మృతదేహానికి దహన సంస్కారాలు.!

మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని ఆనంద నిలయం వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న తిరుపతిరెడ్డి అనే వృద్ధుడు సోమవారం మృతి చెందాడు. శ్రీరాంపూర్ కు చెందిన వృద్ధుడికి ఎవరూ లేకపోవడంతో మూడేళ్ళుగా అనాధ ఆశ్రమంలో ఉంటున్నాడు. దీంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు గోదావరి నది తీరంలో దహన సంస్కారాలు నిర్వహించి మానవతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ చందూరి మహేందర్, సభ్యులు మధుసూధన్ రెడ్డి, కోశాధికారి పడాల రవీందర్, వృద్ధాశ్రమం ఇన్చార్జి సదానందం పాల్గొన్నారు.