మంచిర్యాల జిల్లా: లోన్ యాప్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంచిర్యాల ఇంచార్జ్ డిసిపి అఖిల్ మహాజన్ సూచించారు. మొబైల్స్ కు వచ్చే మెసేజ్ లింకులను ఓపెన్ చేయవద్దన్నారు. మోసపోయిన వారు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని, ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని తెలిపారు. మొబైల్ యాప్ ద్వారా లోన్ తీసుకునే ముందు కంపెనీ వివరాలు ధ్రువీకరించుకోవాలని డిసిపి కోరారు..