నల్లబ్యాడ్జీలు ధరించి ఆర్టీసీ కార్మికుల నిరసన.
మంచిర్యాల జిల్లా: రాష్ట్ర బడ్జెట్ లో ఆర్టీసీకి రెండు శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ శనివారం మంచిర్యాల డిపోలో కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కార్మిక సంఘ కార్యకలాపాలకు అనుమతించాలని, 2017- 21 పే స్కేల్, 6 డిఏలు అమలు చేయాలని, పీఎఫ్, సిసిఎస్ సంస్థలకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ రీజినల్ కార్యదర్శి వి. భీమేశ్వరరావు, డిపో అధ్యక్షుడు రాజేశం, నాయకులు ఉమారాణి, సరోజన, సంధ్య, సిహెచ్ లింగన్న, శంకర్, మేడారం రాజయ్య, శ్రీను, దుర్గేష్, నజీర్, తదితరులు పాల్గొన్నారు..