Telugu Updates

వెహికల్ పార్కింగ్ షెడ్ ను ప్రారంభించిన: మంత్రి

కరీంనగర్ జిల్లా: కరీంనగర్ నగరపాలక సంస్థ పారిశుద్ధ్య వాహనాల పార్కింగ్ కొరకు 14 వ డివిజన్ సప్తగిరి కాలనీలో నూతనంగా నిర్మించిన మున్సిపల్ వెహికల్ పార్కింగ్ షెడ్ ను బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, నగర మేయర్ వై. సునీల్ రావు తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్, స్థానిక కార్పొరేటర్ దిండిగాల మహేష్, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, పలువురు కార్పొరేటర్లు, టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు..