Telugu Updates

విఆర్ఏను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి.

మంచిర్యాల జిల్లా: కన్నెపల్లి విఆర్ఎ దుర్గం బాపు హత్యను నిరసిస్తూ మంచిర్యాల జిల్లాలోని గ్రామ రెవిన్యూ సహాయకులు మంగళవారం రెండో రోజు విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విఆర్ఎను హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని, విఆర్ఎ కుటుంబానికి రూ. 50 లక్షలు ఎక్స్ గ్రేషియా, ఒకరికి ఉద్యోగం, డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వాలని, నైట్ వాచ్ మెన్ డ్యూటీలు రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామ రెవిన్యూ సహాయకుల సంఘం అధ్యక్షుడు సాగే ఓంకార్. ప్రధాన కార్యదర్శి కె. శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు..