ఆంజనేయులు న్యూస్: యూజర్లకు వాట్సాప్ గుడ్ న్యూస్ అందించింది. ఎట్టకేలకు రియాక్షన్స్ ఫీచర్ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇది చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఫీచర్లలో ఒకటి. మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. కంపెనీ ఇటీవల విడుదల చేయాలనుకుంటున్న కొత్త ఫీచర్ల జాబితాను తాజాగా వెల్లడించింది. ఇవాట్సాప్తో పాటు ఇన్స్టాగ్రామ్ లో ఎమోజీలతో సందేశాలకు త్వరగా స్పందించడానికి యూజర్లకు ఈ సౌకర్యం తీసుకొచ్చింది. మిగిలిన యాప్లతో పోలిస్తే చాలా ఆలస్యంగా యూజర్లకు ఈ సౌకర్యాన్ని వాట్సాప్ అందిస్తోంది. తొలుత వినియోగదారులు లైక్, లవ్, లాఫ్, శాడ్, థ్యాంక్స్, ఆశ్చర్యం వంటి ఆరు ఎమోజీలను మాత్రమే పొందుతారని తాజా పోస్ట్ తెలిపింది. భవిష్యత్తులో యూజర్లు అన్ని ఎమోజీలను ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది..
దీనికి అదనంగా భవిష్యత్తులో అప్డేట్ ఎమోజీలు కాకుండా మెసేజింగ్ యాప్లో GIFలు లేదా స్టిక్కర్లను యూజర్లు వినియోగించుకోవచ్చు..