ఆంజనేయులు న్యూస్: టెక్నాలజీలో వస్తోన్న మార్పులు, డేటా భద్రత వంటి వాటి ఆధారంగా కంపెనీలు యూజర్లకు అందించే సేవల్లో మార్పులు చేస్తుంటాయి. ఇందులో భాగంగా పాత తరం డివైజ్లకు సేవలు నిలిపివేస్తాయి. తాజాగా మెసేజింగ్ యాప్ వాట్సాప్ కూడా కొన్ని ఐఫోన్లకు తమ సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. ఐఓఎస్ 10, ఐఓఎస్ 11 వెర్షన్ ఓఎస్లతో పనిచేస్తున్న ఐఫోన్లలో అక్టోబరు 24, 2022 నుంచి వాట్సాప్ పనిచేయదని తెలిపింది. అలానే ఐఓఎస్ 10, ఐఓఎస్ 11 యూజర్లు వెంటనే తమ ఓఎస్ ను అప్డేట్ చేసుకోవాలని <span;>సూచించింది. వాట్సాప్ తాజా నిర్ణయంతో ఐఫోన్ 5, ఐఫోన్ 5 మోడల్స్ మెసేజింగ్ యాప్ సేవలు నిలిచిపోనున్నాయి. ఐఓఎస్ 12 వెర్షన్ ఓఎస్తో పనిచేస్తున్న ఐఫోన్ 5ఎస్, ఐఫోన్ 6, ఐఫోన్ 6ఎస్ యూజర్లకు వాట్సాప్ సేవలు ఎప్పటిలానే అందుబాటులో ఉంటాయని తెలిపింది..
యూజర్స్ తమ ఫోన్లలో ఓఎస్ వెర్షన్ తెలుసుకునేందుకు, ఓఎస్ను అప్డేట్ చేసుకునేందుకు ఐఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్లి అబౌట్పై క్లిక్ చేయాలి. అందులో సాఫ్ట్వేర్ అప్డేట్ ఆప్షన్పై క్లిక్ చేస్తే ఓఎస్ వెర్షన్ చూపిస్తుంది. అలానే ఓఎస్ అప్డేట్ కాకుంటే లేటెస్ట్ వెర్షన్ (ఫోన్ సపోర్ట్ చేస్తే)కు అప్డేట్ అవుతుంది. త్వరలో జరగబోయే 2022 కార్యక్రమంలో యాపిల్ కంపెనీ ఐఫోన్ 14 సిరీస్తో పాటు ఐఓఎస్ కొత్త వెర్షన్ను పరిచయం చేయనుంది. వాట్సాప్ తాజా నిర్ణయంతో ఎక్కువ మంది ఐఫోన్ యూజర్లకు ఎలాంటి సమస్య ఉండకపోవచ్చని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఐఫోన్ యూజర్లలో చాలా మంది లేటెస్ట్ మోడల్స్న ఉపయోగిస్తున్నారనేది వాస్తవం. అలానే సాఫ్ట్వేర్ అప్ డేట్ వల్ల యూజర్లకు డేటా పరంగా మెరుగైన్ సెక్యూరిటీ ఫీచర్లు అందుబాటులోకి వస్తాయని అంటున్నారు.