Telugu Updates

నిన్న మిస్సింగ్.. నేడు విగతజీవిగా.. హత్య?

యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి లో అదృశ్యమైన స్థిరాస్తి వ్యాపారి, మాజీ హోంగార్డు రామకృష్ణ గౌడ్ విగతజీవిగా మారారు. ఆయన మృతదేహం సిద్దిపేట జిల్లా కొండపాక మండలం లక్టారం వద్ద లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ఆయన్ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. రామకృష్ణది రియల్ ఎస్టేట్ గొడవలతో జరిగిన హత్యా? పరువు హత్య అనే కోణంలో విచారణ చేపట్టారు..

వివరాల్లోకి వెళితే… యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లింగరాజుపల్లెకు చెందిన రామకృష్ణ గతంలో యాదగిరిగుట్టలో హోంగార్డుగా పనిచేశారు. గుప్తనిధుల కేసులో ఆయన సస్పెండ్ అయ్యారు. రెండేళ్ల క్రితం రామకృష్ణకు గౌరాయిపల్లికి చెందిన వెంకటేశ్వర్లు కుమార్తె భార్గవితో పరిచయం ఏర్పడింది. 2020లో వారిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరి కులాలు వేర్వేరు కావడంతో భార్గవి తల్లిదండ్రులకు ఆ పెళ్లి ఇష్టం లేదని తెలిసింది. ఈ క్రమంలో గొడవలు కూడా జరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో భార్గవి తన కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ రామకృష్ణతోనే ఉంటానని.. తన తండ్రి ఆస్తిలో వాటా అడగని తెలిపింది. తన తండ్రి ఆస్తిలో వాటా కూడా అడగనంటూ ఓ పత్రంపై రాసిచ్చినట్లు మీడియాకు ఆమె వెల్లడించింది..