Telugu Updates

అంగన్ వాడి కేంద్రంలో యోగా దినోత్సవం వేడుకలు

మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని ఎసిసి సెక్టార్: ఎసిసి- 4 అంగన్ వాడి కేంద్రంలో మంగళవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్ వాడి టీచర్ విజయలక్ష్మి చిన్నారులతో యోగాసనాలు వేయించారు. అనంతరం ఆమె మానసిక ఉల్లాసం, ఆరోగ్య జీవనానికి యోగా ఎంతో దోహదపడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ నిత్యం యోగ చేసి ఆరోగ్యంగా ఉండాలని ఆమే కోరారు..