Telugu Updates

తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన..?

తెలంగాణ: తెలంగాణలో త్వరలో కొలువుల జాతర ఉండనుంది. ఇందులో ఉపాధ్యాయ పోస్టులు కూడా భారీ సంఖ్యలో భర్తీ చేయనున్నారు. అయితే టెట్ లేకుండా డీఎస్సీ ఎలా రాయాలో తెలియక అభ్యర్థులు మదన పడుతున్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. త్వరలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)ను నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం వెల్లడించారు. ఉద్యోగాల కోసం పోటీపడే అభ్యర్థుల నిమిత్తం ప్రతి యూనివర్సిటీలోనూ ఫ్రీ కోచింగ్ సెంటర్లు పెడతామని ప్రకటించారు. యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ల నియామకాలను సైతం వీలైనంత త్వరలో చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమానికి విరాళాలిచ్చే వారికి తగిన గుర్తింపు ఉంటుందని తెలిపారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని, దీనిపై సబ్ కమిటీ నివేదిక ఆధారంగా తుది చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.